బిగ్‌బాస్ 4.. జానీ మాస్టర్ ఎంట్రీ ఇస్తారా?

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (15:51 IST)
బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్‌ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ షోలో నృత్య ద‌ర్శ‌కుడు జానీ మాస్ట‌ర్ పాల్గొన‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఇప్ప‌టికే 'ఢీ' షోలో జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా "బాపు బొమ్మ‌కి పెళ్లంట" అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోనూ పాల్గొని సంద‌డి చేశారు. 
 
అలాంటి వ్యక్తి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెడుతున్నారు. ఆయ‌న బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెడితే ఏమేర‌కు సంద‌డి ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. జానీ మాస్ట‌ర్‌తో పాటు కొరియోగ్రాఫ‌ర్‌ ర‌ఘు మాస్ట‌ర్‌కు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునే అవ‌కాశాలున్నాయని తెలుస్తోంది. 
 
కాగా గ‌త సీజ‌న్‌లో కొరియోగ్రాఫ‌ర్‌ బాబా భాస్కర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయ‌న డ్యాన్స్ క‌న్నా ఎక్కువ‌గా కామెడీని పండిస్తూ ప్రేక్ష‌కుకుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి జానీ మాస్టర్ ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు