అపోలో ఆస్పత్రి నేపథ్యమే ఇతివృత్తంగా 'శశిలలిత'

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:18 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో రెండు చిత్రాలు వచ్చాయి. సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా మహానటి మూవీ వచ్చింది. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో మరో చిత్రం వచ్చింది. ఎన్టీఆర్‌ ఆత్మ చెప్పిన విషయాల ఆధారంగా 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రూపొందిస్తున్నారు. 
 
ఇప్పడు ఈయనే జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. "శశిలలిత" పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఎం జరిగింది అనేది చూపించబోతున్నారు. దీనిపై దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జయలలిత జీవితంలో చోటు చేసుకున్న అన్ని కీలకమైన విషయాలు ఇందులో ఉంటాయి. ఇవన్నీ జయలలిత ఆత్మ చెప్పిన విషయాలు. వాటి ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నా. జయ బాల్యం, నటిగా మారడం, రాజకీయ ప్రవేశం, జయతో తనకున్న పరిచయం వంటి విషయాలు కూడా ఇందులో ఉంటాయి. జయలలిత ఆత్మ కూడా కొన్ని విషయాలు చెప్పిందని వాటి ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. 
 
మరోవైపు కోలీవుడ్‌లో జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని 'ది ఐరన్ లేడీ' పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక రీసెంట్‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ తాను "త‌లైవి" అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు