'శతమానంభవతి'లో ఇద్దరూ భార్యభర్తలుగా నటించారు. దిల్‌రాజు ఇప్పటి పరిస్థితుల్లో మన సంస్క తి సంప్రదాయాలను, కుటుంబ విలువలను మరచిపోకూడదని మంచి మెసేజ్‌లతో కూడా చిత్రాలను తీస్తున్నారు. ఆయన బ్యానర్‌లో చేసిన సినిమాలన్నీ నాకు చాలా మంచి పేరు తెచ్చాయి. బొమ్మరిల్లు సినిమా అయితే ఓ నటిగా నాకు గుర్తుండిపోతుంది.
అలాగే శతమానం భవతి సినిమాకు అలాగే నిలిచిపోతుంది. అందరూ అరిస్టులు, టెక్నిషియన్స్ ఓ ఫ్యామిలీలా కలిసిపోయారు. శర్వానంద్ తన సినిమాల విషయంలో సెలక్టివ్‌గా ఉంటాడని విన్నాను. ఈ సినిమాలో తనతో నటించేటప్పుడు ఆ విషయం నాకు తెలిసింది' అని సహజనటి జయసుధ వ్యాఖ్యానించారు.