జక్కన్న మల్టీస్టారర్‌లో విలన్‌గా రాజశేఖరా? లేదండీ అలాంటి ఆఫర్ రాలేదు

శనివారం, 31 మార్చి 2018 (14:24 IST)
"బాహుబలి" తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించనున్నారు. వీరిద్దరూ బాక్సర్లుగా, సోదరులుగా ఈ చిత్రంలో కనిపిస్తారని టాక్ వస్తోంది. ఇదే సినిమాలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. 
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన జక్కన్న.. ఎన్టీఆర్, చెర్రీ మల్టీస్టారర్ చిత్రంలో విలన్ పాత్ర కోసం యాంగ్రీ హీరో రాజశేఖర్‌కు ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై సినీ నటి జీవిత రాజశేఖర్ తాజాగా స్పందించారు. 
 
విలన్‌గా చేయమంటూ రాజమౌళి నుంచి రాజశేఖర్‌కి ఎలాంటి ఆఫర్ రాలేదని జీవిత చెప్పుకొచ్చారు. తన కుమార్తె శివాని సినిమా ప్రారంభోత్సవానికి రాజమౌళి రావడం వల్ల అలా అనుకుని వుంటారని తెలిపారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు