అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నోట అర్జున్ రెడ్డి మాట వచ్చింది. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ గురించి జాన్వీ కపూర్ స్పందించింది. ఇటీవల విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ సినిమా చేయనున్నట్లు ఒక వార్త షికారు చేసింది. ఆ వార్తలో నిజం లేదు కానీ.. జాన్వీ మాత్రం విజయ్ గురించి మాట్లాడింది.
కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవల శ్రీదేవి కుమార్తె పాల్గొంది. ఆ సమయంలోనే నువ్వు మగాడిగా మారితే ఎవరిలా వుండాలని కోరుకుంటావ్ అనే ప్రశ్నకు జాన్వీ విజయ్ దేవరకొండ అంటూ సమాధానమిచ్చింది. మగాడిగా మారితే విజయ్ దేవరకొండ మాదిరిగా మారుతానని.. ఉత్తరాదిన ఎంతోమంది యంగ్ హీరోలుండగా, దక్షిణాదిన హీరోగా ఎదుగుతోన్న విజయ్ దేవరకొండ పేరును జాన్వీ కపూర్ చెప్పడం అందరినీ షాక్ ఇచ్చింది.