21 ఏళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఆ జంట సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లదే. అవును.. నిజమే. దర్శకుడు అభిషేక్ వర్మన్ భారీ మల్టీస్టారర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌లు కలిసి నటించనున్నారు. దర్శకుడు అభిషేక్ వర్మన్ ప్రస్తుతం ''కళంక్'' అనే మల్టీస్టారర్ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్‌లతో పాటు అజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లు కలిసి నటించనున్నారు. ఇద్దరూ ప్రస్తుతం షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారని బిటౌన్ వర్గాల్లో టాక్.
ఇప్పటికే తానీధర్, ఖల్నాయక్, సాజన్ వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట మళ్లీ వెండితెరపై మెరవనుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీ వరకు సంజయ్, మాధురీ దీక్షిత్‌ల మధ్య షూటింగ్ వుంటుందని.. ఓ పాట కూడా మాధురీపై షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.