భారత్‌లో భావ వ్యక్తీకరణ అనేది ఓ పెద్ద జోక్‌ : కరణ్‌ జోహార్‌

శుక్రవారం, 22 జనవరి 2016 (14:27 IST)
భారతదేశంలో ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ ఉందనేది పెద్ద జోక్‌ అని బాలీవుడ్‌ సినీ నిర్మాత కరణ్‌ జోహార్‌ చెప్పుకొచ్చారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జయపురలో జరుగుతున్న జయపుర సాహిత్య సదస్సు (జయపుర లిటరేచర్‌ ఫెస్టివల్‌)లో ఆయన పాల్గొని మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయనకు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. భారత్‌లో అసహనంపై జరిగిన చర్చలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేదంటూ ఓ విలేఖరి ప్రశ్నించగా, ఆయన నుంచి పై విధంగా సమాధానమిచ్చారు. ఏదైనా విషయంపై అభిప్రాయాన్ని చెబితే.. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
తానొక సినీ నిర్మాత అయినప్పటికీ.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తనకు లేదని చెప్పారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని.. వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనిపిస్తోందని తన భార్య అన్నట్లుగా ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమీర్‌ఖాన్‌ పేర్కొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ పైవిధంగా స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి