'కాటమరాయుడు' నైజాం హక్కులు అభిమానికి ఇచ్చిన పవన్ కళ్యాణ్

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:16 IST)
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు హీరో నితిన్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తంచేశారు. ఆసియన్‌ ఫిల్మ్స్‌, శ్రేష్ట్ మూవీస్‌ కలిసి పవర్‌స్టార్‌ 'కాటమరాయుడు' సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.
 
కిషోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. 

వెబ్దునియా పై చదవండి