పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పించే సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.. నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తన హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను వేడి పుట్టిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో కత్తి మాట్లాడుతూ... బాలయ్యపై మండిపడ్డాడు.
మనుషులను, అభిమానులను కొట్టడం అనైతికం. ఆయనకి మెడికల్ కౌన్సిలింగ్ అవసరమని కత్తి మహేష్ ఎద్దేవా చేశాడు. వీలైనంత త్వరగా బాలయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. తను ఓ రాజు అయినట్టు, తన వంశం మాత్రమే గొప్పదైనట్టు బాలయ్య ఫీలవుతున్నాడని కత్తి ఏకిపారేశాడు.
తనకు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నచ్చి ఎంతో మెచ్చుకున్నానని, కానీ, బాలయ్య ప్రవర్తన చాలా అనాగరికంగా ఉంటుందని మహేష్ తెలిపాడు. తను పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు, మోదీ.. ఎవరి గురించైనా ధైర్యంగా మాట్లాడగలనని వెల్లడించాడు.