బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కరోనా పాజిటివ్, నాతో సమీపంగా వున్నవారంతా టెస్ట్ చేయించుకోండి

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:24 IST)
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్‌-19 పాజిటివ్‌తో వెంటనే స్వీయ నిర్బంధం(హోంక్వారంటైన్)లోకి వెళ్లినట్టు ఆమె తెలిపింది. 
 
అలాగే, తనతో సమీపంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. తనపై చూపే ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలంది. జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాల్సిందిగా కత్రినా కోరారు.
 
కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 58 శాతం ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదతువుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది సెలెబ్రిటీలు ఈ వైరస్ కోరల్లో చిక్కుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు