బిగ్ బాస్ విన్నర్ కౌశల్ నటించిన "అతడు ఆమె ప్రియుడు" చిత్రం నుండి అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్ ను ఈరోజు చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే... ఈ డైలాగ్ ట్రైలర్ ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా & కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్.