నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన... ఈ మలయాళ ముద్దుగుమ్మ తొలి చిత్రంలోనే అద్భుతంగా నటించి తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో మరో విజయం సాధించిన కీర్తి సురేష్ మహానటి సినిమాలో సావిత్రిగా నటించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇదిలా ఉంటే... ప్రతి వారికి ఓ లక్ష్యం ఉంటుంది కదా... అలాగే కీర్తి సురేష్‌కి ఓ లక్ష్యం ఉందట.
ఇంతకీ ఆ లక్ష్యం ఏంటంటారా..? డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ రంగంలోకి రాలేదు. మంచి కథా చిత్రాల్లో నటించి పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నదే ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం అని అంటోంది కీర్తి సురేష్. దాని వైపే నా పయనం సాగుతోంది అని చెప్పింది. శ్రమకు తగ్గ పారితోషికం, అది చిన్న మొత్తం అయినా సంతృప్తిగా లభిస్తే చాలు అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా సావిత్రిగా నటిస్తుండటం విశేషం.