గత 2015లో సుమత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సుకృతి ఇపుడు ఓ ఇంటికి కోడలుకానుంది. ఈ సినిమా ద్వారా ఆమెకుమంచి పేరు వచ్చింది. అయితే, ఆమెకు సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది.
ఈ జంట ఇద్దరూ కలిసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశితార్థం సందర్భంగా తన నాన్న గురించి కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది సుకృతి.