నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్‌ల హిట్ కాంబినేషన్‌లో ఒక పర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తోన్న చిత్రమిది. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ టెక్నికల్‌గా హైస్టాండర్స్‌లో నిర్మించబోతున్నాం. ఆగస్ట్13 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కిరాతక తప్పకుండా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది`` అన్నారు.
దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. కిరాతక టైటిల్‌తో పాటు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పూత్ కాంబినేషన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ తప్పకుండా ఆకట్టుకుంటుంది. పూర్ణ, దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ తో పాటు మరికొంతమంది ఫేమస్ ఆర్టిస్టులు నటిస్తున్నారు వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పూత్, పూర్ణ, దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్, అరవింద్, మహేష్, అరుణ్‌బాబు, గోవర్థన్, టార్జాన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ల, నిర్మాత: డా. నాగం తిరుపతి రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం. వీరభద్రమ్.