'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో' పాటకు స్పూఫ్.. వైరల్

మంగళవారం, 9 జనవరి 2018 (09:53 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం"అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ చిత్రంలో పవన్ ఓ పాటపాడారు. 'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో...' అంటూ సాగే ఈ పాట ఇపుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా పవన్ ఫ్యాన్స్ ఈ పాటకు స్పూఫ్ చేసి తమ బద్ధశత్రువుపై ప్రయోగించారు. 
 
అతన్ని ఎక్కడా తిట్టకుండానే తిడుతూ, కొట్టకుండానే కొడతామని హెచ్చరిస్తూ సాగిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు