చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే....ఇటీవల మీడియా ముందుకు వచ్చిన చిరును చూస్తే.. చాలా బొద్దుగా ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. ఖైదీ నెం 150తో పోలిస్తే ఆయన బాగా లావయ్యారనే చెప్పాలి. సైరాకి బరువు, లావు ఇబ్బంది కాదు. ఎందుకంటారా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు ఆ మాత్రం `భారీ`దనం కావాల్సిందే.
చిరు కనీసం 15 కిలోలైనా బరువు తగ్గాలని చెప్పాడట. అందుకోసం ప్రత్యేకమైన డైట్, వ్యాయామాలు మొదలెడుతున్నారని, చిరు కోసం ఓ ట్రైనర్‌ని చరణ్ నియమించాడని తెలిసింది.