ఆదిపురుష్‌లో కృతిసనన్... కెమిస్ట్రీ బాగా అదిరిందిగా!

బుధవారం, 29 జూన్ 2022 (13:01 IST)
Prabhas
ఆదిపురుష్‌లో కృతిసనన్ నటించనుంది. ప్రభాస్‌తో కృతిసనన్ రొమాన్స్ చేయనుంది. ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌గా రూపుదిద్దుకుంది.

కృతి-ప్రభాస్ వంటి చాలా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మర్స్ కలిసి స్క్రీన్ పంచుకోవడం ద్వారా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు.  
 
గతవారం ఆదిపురుష్ టీమ్ ఈ సినిమాకు షూట్ చేసిన సీన్స్‌ను ప్రదర్శించడం చేశారు. ప్రభాస్ - కృతిసనన్‌లపై షూట్ చేసిన సన్నివేశాలు బాగొచ్చాయని టీమ్ వెల్లడించింది.

కెమిస్ట్రీ అదిరిందని టాక్ వచ్చింది. ఇక ఆదిపురుష్ సినిమా 2023, జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు