సినిమా అనగానే హీరో, విలన్, హీరోయిన్ ప్రధానంగా వుంటారు. హీరోయిన్ల పాత్రలు చాలా పరిమితం. హీరోకు హెల్ప్ చేయడం, లేదంటే డ్యూయెట్లు పాడడం వరకు పరిమితం అవుతున్నారు. అలాంటిది కొంతమంది విలనిజం అంటే ఎలా వుంటుందో చూపించే ప్రయత్నం చేశారు. అందులో ఈనాడు అందరికీ తెలిసిన నటి రమ్యకృష్ణ. రాశికూడా ఇంతకుముందు లేడీ విలన్‌గా చేసిందే.
ఇప్పుడు లేడీ విలన్‌గా చూపిస్తూ కథలు రాసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త దర్శకులు. అలాంటి ప్రయత్నాలలో యంగ్ విలన్‌గా అందరికీ తెలిసిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తను విలన్‌గా పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె బాటలో మరికొంతమంది నిలుస్తున్నారు. కీర్తిసురేష్ తమిళంలో సాని కాయిధం చిత్రంలో నెగెటివ్ షేడ్ వున్న పాత్రను పోషిస్తోంది. తమన్నా కూడా ఆమధ్య దెయ్యంగా నటించింది. ఇప్పడు నితిన్‌తో మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఇది బాలీవుడ్ అంధాధున్ రీమేక్.. ఇందులో టబు చేసిన ప్రతినాయిక పాత్ర తమన్నా చేయనుంది. పాయల్ రాజ్ పుత్ కూడా త్రీ రోజస్ వెబ్ సిరీస్ లో విలన్‌గా నటిస్తోంది.
అలాగే రెజీనా కూడా విశాల్ నటించిన `చక్ర`లో విలన్‌గా మెరిసింది. ఇక సమంతకూడా తనకు నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలు కావాలని రచయితలను అడుగుతుంది. ఇప్పకే అన్ని పాత్రలు చేసేసింది. కొత్తగా వుండాలనే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో నెగెటివ్ చేస్తుంది. ఇటీవలే పుష్ప సినిమాలో అనసూయ పాత్ర బయటకు వచ్చింది. ఇందులో తను నెగెటివ్ టచ్ వున్న పాత్ర అంటూ చెప్పింది. ఇలా హీరోయిన్లు కొత్త తరహాలో ఆలోచిస్తున్నారు.