ఈ లెజండరీ దర్శకుని సృజనాత్మకకు ప్రతిరూపమైన మరో ఆణిముత్యం "శంకరాభరణం". ఆయన చిత్రాల్లో "శంకరాభరణం" చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2వ తేదీన ఆ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రానికి ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ అత్యంత ప్రజాదారణ పొందింది.