కరోనా భయాల నుంచి నెమ్మదిగా బయటపడుతున్న చిత్ర పరిశ్రమలో ఈ దీపావళి సరికొత్త వెలుగులు పంచుతోంది. థియేటర్‌లో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ దీపాల పండగకు ‘పెద్దన్న’, ‘ఎనిమి’, ‘మంచి రోజులు వచ్చాయి’ తదితర చిత్రాలు సందడి చేస్తుండగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెబుతూ, సరికొత్త పోస్టర్లు, టీజర్లు, సాంగ్ ప్రోమోలు, లిరికల్ వీడియోలు విడుదల చేశాయి.