నానుమ్ రౌడీదాన్ సినిమా హిట్ కావడంతో నయనతార ఆ సినిమా డైరక్టర్ విఘ్నేష్‌ల పెళ్లి ఖాయమని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా నయనతార ఎవరితో ప్రేమాయణం నడిపినా ఆ వ్యక్తి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉండేది. అయితే నయన్, విఘ్నేష్‌ల ప్రేమాయణం మాత్రం సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.
వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నానుమ్ రౌడీ దా’ మొన్న దసరాకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే నయన్ ఎవరితో ప్రేమాయణం నడిపితే ఆ వ్యక్తి సినిమా ఫ్లాప్ అన్న సెంటిమెంటు ఈసారి బ్రేక్ అయింది. ‘నానుమ్ రౌడీదా’ పెద్ద హిట్టు. ఇది నయన్ లవ్ స్టోరీ కూడా హిట్ కాబోతోందనడానికి ఇండికేషన్ అని.. సినిమాలాగే లవ్ స్టోరీ కూడా పండి.. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.