అలాగే ఓ ఫోటోను కూడా భరత్ టీమ్ విడుదల చేసింది. ఓ సభకు భారీగా ప్రజలు హాజరైన ఫొటోపై ''శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అనే ప్రమాణ స్వీకార పాఠంతో కూడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.