టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన కొత్త సినిమా టీజర్ రిలీజైంది. కాలేజీ స్టూడెంట్ లుక్‌లో మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది 25వ సినిమా. మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. గురువారం ఉదయం మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్‌ను అవుట్ చేశారు. ఈ సినిమాకు ''మహర్షి'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.