సంక్రాంతి బ్లాక్‌బస్టర్ సరిలేరు నీకెవ్వరు టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో పాటు సినీనటి విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, రాజేంద్రప్రసాద్, ఇతర చిత్ర బృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌లతో కూడా ఫోటోలను తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. అయితే టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఫోటోలు తీసుకోనీయకుండా భక్తులను పక్కకు పంపేశారు. కొంతమంది భక్తులు దూరం నుంచి తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలను తీసుకుంటూ కనిపించారు. సినిమా హిట్ కావడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా తాను నటించిన సినిమా హిట్ అయితే మహేష్ బాబు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ వస్తున్నారు.