పాత దర్శకులందరినీ మహేష్ బాబు ఆహ్వానిస్తున్నాడట..! ఎందుకో తెలుసా..?

బుధవారం, 24 ఏప్రియల్ 2019 (17:33 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ముందుకు సాగిపోతున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. 1999వ సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడుతో తెలుగు తెరకు హీరోగా పరిచయమై, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తాజాగా మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. 
 
అయితే ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రం కావడం గమనార్హం. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. 
 
ఇది తన సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో మహేష్ బాబు గత 24 చిత్రాల దర్శకులందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. 
 
ఇందులో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్దే కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు