ఈ చిత్రంను థియేటర్లలో విడుదల చేయడానికి పూర్వమే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ఏడు భాషలలో రూపుదిద్దుకుంది. అయినప్పటికీ ఈ చిత్రంను ప్రదర్శించడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడానికి దీని కథాంశం కూడా ఓ కారణమే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందించబడిన ఈ చిత్రంలో ప్రీమియర్ విద్యాసంస్థలలో దళిత విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షను వెల్లడించారు.
ఈ చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత సంజీవ్ జైశ్వాల్ మాట్లాడుతూ, భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయాలన్నది మా కల. అయితే ఈ చిత్ర ప్రదర్శనకు మాకు థియేటర్లు లభించడం లేదిప్పుడు. ఎవరికీ తెలియని, మరుగనపడిన వాస్తవాలను చూపడం ద్వారా స్ఫూర్తి కలిగించాలన్నది మా ప్రయత్నం. ఈ కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నాము. మాకు థియేటర్లు లభించలేదు సరికదా కనీసం కపిల్ శర్మ షోలో పాల్గొనే అవకాశం కూడా లభించలేదు. ఈ దిశగా మేము ప్రేక్షకుల మద్దతు కోరుతున్నాము. థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శనకు మద్దతునందించడం కోసం 7247248449కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని అన్నారు
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు అనిరుధ్ దవే మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణంలో మేమంతా తీవ్రంగా కష్టపడ్డాము. ఈ చిత్ర ప్రదర్శనకు థియేటర్లు లభించకపోవడం మాకు పెద్ద కుదుపు. అయితే మేమంతా దీనిని అధిగమించాలనుకుంటున్నాము. ఎందుకంటే వివక్షను ఎదుర్కొంటున్న ప్రజలకు దీనిని మేము అంకితమివ్వాలనుకుంటున్నాము అని అన్నారు. ఈ చిత్రంలో గరీమా కపూర్, ఆదిత్య ఓం తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.