బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ భారతదేశం ఇప్పుడు అత్యాచారాలకి అడ్డాగా మారింది.
ఈ టైంలో ప్రజలందరు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారు. కథువా, ఉన్నావ్ లాంటి సంఘటనలు మీడియా లేకపోతే బయటకి వచ్చేవే కావు. మీడియా ఒత్తిడి వలనే మైనర్లపై అత్యాచారం ఒడిగట్టేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం ఉంది. ఈ విషయంలో ఏం చేయాలన్న అది మీడియాకి మాత్రమే సాధ్యం అని మల్లికా అన్నారు.
ఆమె ''దాస్ దేవ్" చిత్రాన్ని గురువారం రాత్రి ముంబైలోని అంథేరి మల్టీప్లెక్స్‌లో స్పెషల్ స్క్రీనింగ్ వేయగా, ఈ షోకు హాజరైన మల్లిక సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో పిల్లలు, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు దారుణమన్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు జమ్ముకాశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలని ఖండిస్తూ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.