మంచు మనోజ్ పెళ్లి సందడిలో భాగంగా ఈ పూజా కార్యక్రమం జరుగుతున్నట్లు టాక్. ఇందుకోసం కొంతమంది బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. గత ఏడాది మనోజ్-భూమా మౌనిక గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని నెలలుగా మనోజ్-మౌనిక అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సహజీవనం చేస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఫైనల్‌గా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ, విభేదాలు రావడంతో 2019లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు