ఇండియాలో స్పోర్ట్స్ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన సీనియర్ నటి, మోడల్ మందిరా బేడీ చాలా కాలం తర్వాత హాట్‌హాట్ ఫొటోలతో అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరల్‌గా మారిన ఆ ఒక్కో ఫొటోలు ఒక్కొక్కటీ 50 వేలు తగ్గకుండా లైక్స్‌తోపాటు వందలకొద్దీ షేర్స్ వచ్చాయి.
శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో తారాస్థాయికి చేరింది. ఇండియాలో స్పోర్ట్స్ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్‌నెస్ రంగంలోనూ రాణించారు. గతంలోనూ తన భర్త, కొడుకుతో కలిసి మందిర దిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కానీ తన అయిదేళ్ల కుమారుడిని పక్కన పెట్టుకుని ఇంత గ్లామర్ ఒలకపోయడం సభ్యతేనా అనే ఒక్క ట్వీట్ కూడా మందిర ఫొటోల మీద రాకపోవడం విశేషం. భర్త పక్కనుంటేనేమి. కుమారుడు పక్కన ఉంటేనేమీ.. అలా కనబడితే చాలు లైకులకు, షేర్‌లకు దిగిపోతున్న కాలమిది .. ఏం చేస్తాం..