కథ విన్నప్పుడు అన్వేషణ - సినిమా చూశాక అరుంధతి గుర్తొచ్చింది : దిల్ రాజు

శనివారం, 18 నవంబరు 2023 (20:30 IST)
Dil Raju with mangalavaram team
దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా 'మంగళవారం'.  'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత ఆయన తీసిన చిత్రమిది. పాయల్ రాజ్‌ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
అగ్ర నిర్మాత, చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన 'దిల్' రాజు మాట్లాడుతూ,  నాకు ఈ కథ విన్నప్పుడు వంశీ గారి 'అన్వేషణ' గుర్తుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఎంజాయ్ చేశానో... కథ విన్నప్పుడు అలా ఎంజాయ్ చేశా. ముందుకు వెళ్ళమని చెప్పా. అప్పుడు స్వాతి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పాడు. తాను అనుకున్నది వచ్చే వరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను వదిలిపెట్టి ఉండదు. కథ నచ్చడంతో నైజాం తీసుకున్నా. ప్రీమియర్లు వేయాలని అనుకున్నట్లు చెప్పారు. 'ముందు నాకు చూపించండి. బావుంటే ఓకే. ఒకవేళ మిస్ ఫైర్ అయితే కష్టం' అన్నాను. బుధవారం ఉదయం షో వేశారు. కథ నాకు తెలిసినా సాధారణ ప్రేక్షకుడిలా చూశా. ఇంటర్వెల్ అవ్వగానే ఆసక్తిగా ఉందని చెప్పా. సెకండాఫ్ ఫస్ట్ 20 నిమిషాలు 'వావ్' అనిపించాడు. 'అరుంధతి' సినిమా ఇక్కడే చూశా. అప్పుడు ఏదైతే ఫీల్ కలిగిందో... అలా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో పార్ట్ రివీల్ చేస్తూ వచ్చాడు. ఈ రోజు ప్రేక్షకులు సినిమా బావుందని అనడానికి కారణం క్లైమాక్స్, ఆ ట్విస్టులు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికి ఇవ్వాలి. కొత్తవాళ్లుతో, కొత్త నిర్మాతలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. కథ విన్నప్పుడు, సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానో... ఇప్పుడు ప్రేక్షకులు చెప్పినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యా.

తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న నిర్మాత స్వాతి గారికి కంగ్రాట్స్. ఈ సినిమా నైజాంలో శుక్రవారం ఉదయం 18 లక్షలు, మ్యాట్నీ 20 లక్షలు, ఈ రోజు ఉదయం 15 లక్షలు, మ్యాట్నీ 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మౌత్ టాక్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే సాక్ష్యం. బలగం, బేబీ, సామజవరగమన, ఇప్పుడీ 'మంగళవారం' విజయాలు ఉదాహరణ. ఇది ఆగే సినిమా కాదు... ఇంకా పెద్ద సినిమా అవుతుంది'' అని చెప్పారు. 
 
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ, పెయిడ్ ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రానికి ఆల్మోస్ట్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. తర్వాత పెయిడ్ ప్రీమియర్ షోలు పెంచాం. సినిమా చూసిన వాళ్ళు ఎంతో బాగా చూపించారు.నేను మూడు సినిమాలు తీస్తే ముగ్గురు తెలుగు కెమెరా మ్యాన్స్ వర్క్ చేశారు.  ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పా... 'ఇది టెక్నీషియన్స్ మూవీ' అని! ఈ రోజు అందరూ టెక్నికల్ వర్క్, ట్విస్ట్స్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. అందుకని రస్టిక్, రియలిస్టిక్ బ్లాక్ బస్టర్ అని వేశా.

కొత్తవాళ్లతో బ్లాక్ బస్టర్ తీశా. మరోసారి ఎందుకు ప్రయోగం చేయకూడదని అనుకున్నా. 'మంగళవారం' చూసిన ప్రేక్షకుల నుంచి నాకు రెస్పెక్ట్ లభించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇది టీమ్ అందరి హిట్. మేమంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అవుటాఫ్ బాక్స్ స్టోరీ తీసుకుని హిట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. పాయల్ కూడా చక్కగా నటించింది. ఆమె పెర్ఫార్మన్స్ చూసి ఉంటారు కదా! 'ఆర్ఎక్స్ 100', ఈ సినిమా చేయడానికి దమ్ము ఉండాలి. తొలుత ఈ సినిమాలో వేరే వాళ్ళను తీసుకోవాలి ఆడిషన్స్ చేశా. కానీ, ఎవరూ సెట్ కాలేదు. ఆ టైంలో పాయల్ మెసేజ్ చేసింది. ఆమె పెర్ఫార్మన్స్ గురించి డౌట్ లేదు. కానీ, ఆడిషన్ చేశా. బోల్డ్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవడం తన సక్సెస్. సినిమాను ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ మీద తీసినా... ఫైనాన్షియల్ ప్రెజర్ నా కంటే సురేష్ వర్మ, స్వాతి గారికి ఎక్కువ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా '' అని అన్నారు. 
 
నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ, . నా కలను నిజం చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారు. నాకు ఏవైనా సందేహాలు ఉంటే అజయ్ భూపతి గారు అర్థం అయ్యేలా చెప్పారు. నన్ను చిన్న పిల్లలా చూసుకున్నారు. ఆయన లేకపోతే ఈ ప్రయాణం ఇంత ఈజీగా ఉండేది కాదు. నేను ఈ సినిమా చేయాలని ఆయన వెయిట్ చేశారేమో అనిపించింది. ఇది థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో మంచి సందేశం ఉంది. మహిళలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి. నాకు ఆ మెసేజ్ నచ్చి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా.అని అన్నారు.  
 
నిర్మాత ఎం. సురేష్ వర్మ మాట్లాడుతూ ''ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మాటలు రావడం లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. కథపై నమ్మకంతో నేను, మా తమ్ముడు అజయ్, స్వాతి రెడ్డి గునుపాటి సినిమా చేశాం. వెనక్కి తిరిగి చూడలేదు. కొత్త నిర్మాతలు, కొత్త కథతో తీసిన సినిమాను ఇంత ఎంకరేజ్ చేసినందుకు థాంక్స్. సినిమా చూడని వాళ్ళు చూడాలని కోరుతున్నా. పాయల్ అద్భుతంగా నటించారు. మా స్వాతికి థాంక్స్. ఆమె లేకుండా మా కల పూర్తి అయ్యేది కాదు. అజయ్ భూపతి పని రాక్షసుడు. అతనికి సక్సెస్ వచ్చినందుకు మాకు ఎక్కువ సంతోషంగా ఉంది. అజయ్... నువ్వు నీ రూటులో వెళ్ళు. 'దిల్' రాజు గారు సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు. ఆయనకు స్పెషల్ థాంక్స్. అలాగే, సీడెడ్ అండ్ ఆంధ్రలో విడుదల చేసిన శంకర్ ఫిలిమ్స్ శంకర్ అండ్ నవీన్ గారికి థాంక్స్'' అని అన్నారు.
 
పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ''ఈ సినిమా హిట్ అవుతుందని నేను ముందే అనుకున్నా. కానీ, ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. మా టీంతో పాటు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అజయ్ భూపతి గారు ఇచ్చారు. 'ఆర్ఎక్స్ 100', ఇప్పుడు 'మంగళవారం' ఇచ్చారు. ఒక్క సినిమాతో నా పని అయిపోతుందని అనుకున్నారు. 'మంగళవారం'తో అది తప్పు అని నిరూపించా. సరైన దర్శకుడు, కథ వస్తే నేను వండర్స్ క్రియేట్ చేస్తా'' అని అన్నారు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు