కంగనా రనౌత్ సత్తా చాటింది.. మూడు భాషల్లో మణికర్ణిక

బుధవారం, 12 డిశెంబరు 2018 (17:14 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో మణికర్ణిక సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మూడు భాషల్లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితచరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న మణికర్ణిక సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న విడుదల కానుంది. 
 
ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు చాలావరకు క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ డైరక్ట్ చేయనుండటంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో కంగనా రనౌత్ దర్శకత్వ పగ్గాలు చేపట్టింది. కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నిర్మాతలు వెనుకంజ వేశారు. 
 
సోనూసూద్ వంటి నటుడు సినిమా నుంచి తప్పుకున్నాడు. అయినప్పటికీ కంగనా పట్టుదలతో సినిమాను పూర్తి చేసింది. ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు