అనంతరం దుర్వానుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ. .రామాయణాన్ని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది. అందులో మొదటి భాగం పూర్వ రామాయణం ఇది షూట్ పూర్తిచేసుకుని 11 రోజులయ్యింది. మనకు బిడ్డ పుట్టిన తరువాత మనం భారసాల చేసుకోవడం మన ఆచారం. ఆలా ఈ రోజు ఈ సినిమాకు బారసాలలో "కోడ్ రామాయణ" అని నామకరణం చేయడం జరిగింది. కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం.అలాగే రామాయణంలో ఏం చెప్పడం కోసం రామాయణం వచ్చింది అనేది ముఖ్య ఉద్దేశ్యం. దీని తరువాత వచ్చే రెండవ భాగం "రావణచరిత్ర" మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. తరువాత వచ్చే మూడవ భాగం "ఉత్తర రామాయణం" ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ..మన జీవితాలు ఎక్కడనుండి ప్రారంభమయ్యి ఎక్కడకి వెళుతున్నామని మన గడ్డ అయిన డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి వివరిస్తూ భారత దేశంలో ఉన్న కులాలు, మతాలు అన్ని డెమాక్రటిక్ గా సర్వ సమత లాగే ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పిన మన డ్రవిడ భూమి ఏ కారణాలు చేత మరుగున పడి గుర్తింపు లేకుండా ఉండి పోయిందని తెలియ చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.