మహాభారతంపై సినిమా తీసేందుకు మాలీవుడ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భీముడి పాత్ర చుట్టూ తిరుగుతుందని.. భీమసేనగా మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. మహాకావ్యమైన భారతాన్ని వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకుమార్ మేనన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ చిత్రం మహాభారతం మొత్తాన్ని కవర్ చేయదని.. భీముని పాత్రను మాత్రమే స్వీకరించి సినిమా చేయడం జరుగుతుందని టాక్. ఈ సినిమాకు మహాభారత అనే పేరును ఖరారు చేస్తున్నామని.. పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పేరును మార్చేప్రసక్తే లేదని శ్రీకుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా అబుదాబిలో ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే షెడ్యూల్స్ కూడా సినీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
అబుదాబిలోనే మోహన్ లాల్ మహాభారతం షూటింగ్ ప్రారంభించాలని ఎందుకు అనుకుంటున్నారంటే.. కథ ప్రకారం బడ్జెట్ కేటాయించాల్సింది యుద్ధ సన్నివేశాలకే. మిగిలినదంతా ఎలాగూ సెట్స్ వేయక తప్పదు. అందుకే తొలుత వార్స్ సీన్లను షూట్ చేసి.. కురుక్షేత్ర సంగ్రామం తరహా లొకేషన్‌కు ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎడారి ప్రాంతంలో సినిమా షూట్ చేసి అందుకు గ్రాఫిక్ వర్క్ జోడించడం సులభమని సినీ యూనిట్ అబుదాబిని ఎంచుకున్నట్లు సమాచారం.