సాధారణంగా హీరోల కుమార్తెలు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడం అరుదు. నందమూరి హీరోస్, మెగా హీరోస్, అక్కినేని హీరోస్, కృష్ణ ఫ్యామిలీ హీరోస్ ఇలా వంశపార్యంగా హీరోలే తెరంగేట్రం చేస్తారు. అయితే హీరోయిన్లుగా హీరోల కూతుళ్ళు తెరపై కనిపించరు. కానీ సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల మాత్రం వెండితెర ఒకే సినిమాలో కనిపించి.. నిర్మాతగా తెరవెనుక పనులకు తిరిగెళ్లిపోయింది. మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి సినీ తెరపై కాస్త పేరు తెచ్చుకుంది.
ఇప్పటికే నిహారిక రెండు టీవీ షోల్లో కనిపించింది. ఆడియన్స్ కూడా ఆమెను అస్సెప్ట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు నిహారికను తెరంగేట్రం చేయించేందుకు నిర్మాతలు, దర్శకుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. నిహారిక నటించడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. ఇప్పటికే నిహారిక స్క్రిప్ట్ వినే పనుల్లో ఉందని అంతా కుదిరితే త్వరలోనే నిహారిక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ పండితులు అంటున్నారు.