టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున, సీనియర్ నటి రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటిలు జంటగా నటిస్తున్న చిత్రం "సోగ్గాడే చిన్ని నాయనా". ఈ చిత్రం షూటింగజ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రం టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
అయితే, ఈ మూవీలో తండ్రి పాత్ర అయిన సోగ్గాడు చనిపోయి ఒక ఆత్మలా మారి తన కొడుకుకి మాత్రమే కనిపిస్తుంటాడని, అమాయకుడైన తన కొడుకుకి, తండ్రికి మధ్య జరిగే ఎపిసోడ్స్ ఫన్నీగా ఉంటాయని నాగార్జున సూచాయిగా వెల్లడించారు. కాగా, ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.