మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ముందుగా తాను అధ్యక్షుడిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు మూడు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత మంచు విష్ణు, ఆ తర్వాత జీవిత రాజశేఖర్, హేమ కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఇంతమంది పోటీ పడుతున్నారంటే ఏదో ప్రత్యేకత వుందని ఛానల్స్, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించారు. అందుకే శుక్రవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.