ఒకపక్క కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన హీరో మరోపక్క కెరీర్ మొదట్లో రెండు హిట్లు కొట్టి తరువాత హిట్లు లేక కొంతకాలం టాలీవుడ్‌కి దూరమైన మరోహీరో. ఈ ఇద్దరు హీరోలు ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరిక్షి౦చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు నాని-ఆది, ఈ ఇద్దరు నటించిన సినిమాలు కృష్ణగాడివీరప్రేమగాథ, గరం సినిమాలు. శుక్రవారం రిలీజ్ అయ్యాయి. లో బడ్జెట్ హీరో స్థాయి నుంచి స్టార్ రేంజ్‌కి ఒకేసారి వెళ్లిపోయిన నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఒకటైతే.. డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న ఆది నటించిన గరం మూవీ మరొకటి. నాని గత సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాస్త ఎక్కువే ఖర్చు చేశారు. అలాగే సొంత సినిమా అవడంతో.. ప్రెస్టీజియస్‌గా తీసుకుని ఆది కోసం కూడా బాగానే వెచ్చించారు.