నాని భలె భలె మగాడివోయ్ సినిమా శ్రీమంతుడు రికార్డును బద్ధలు కొట్టింది. నాని కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ సెప్టెంబర్ నాలుగో తేదీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో, యువి క్రియేషన్, జిఏ2 సంయుక్తంగా ప్రొడక్షన్ నెం.1 గా రూపొందిన పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్' విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.
సినిమా విడుదలైన రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు 3.15 కోట్లు షేర్ సంపాదించింది. నాని కెరీర్లో ఈగ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం. నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా, మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, బద్రమ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.