`జాంబిరెడ్డి` హీరో తేజసజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం అద్భుతం. మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజనల్స్ బ్యానర్లు పై చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మాతగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. జాంబిరెడ్డి, కల్కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 1న శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అద్భుతం ఫస్ట్ లుక్ విడుదలైంది. నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ఫస్ట్ లుక్ ని తన సోషల్ మీడియా ఖాతాలు ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.