ఓటీటీలో నాని "టక్ జగదీష్" రిలీజ్

ఆదివారం, 22 ఆగస్టు 2021 (15:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమ కరోనా వైరస్ కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఫలితంగా థియేట‌ర్‌లో విడుద‌ల కావ‌ల‌సిన సినిమాలు ఓటీటీలో విడుద‌ల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 
 
ఇప్పటికే అనేక సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చినా కూడా పెద్ద ఇష్యూ జ‌ర‌గ‌లేదు. కాని 'ట‌క్ జ‌గ‌దీష్' విష‌యంలో ప‌రిస్థితులు వేరేలా ఉన్నాయి. 'ట‌క్ జ‌గ‌దీష్' చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నాం అని నాని, నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌గా, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్సిసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
నానిపై దారుణ‌మైన కామెంట్స్ చేయ‌డం, ఆ త‌ర్వాత సారీ చెప్ప‌డం జరిగింది. 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ సంస్థ తాజాగా ఓ ప్రకటనలో క్షమాపణలు కోరింది. వచ్చే నెల పదో తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా, అదే రోజున నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించి, శేఖర్ కుమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ థియేటర్లలో విడుదలకానుంది. 
 
ఈ నేపథ్యంలో టక్ జగదీష్ నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది "రెండున్నరేళ్ల క్రితమే సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. కష్టంలో ఉన్నాం. అందుకే ఇప్పుడు ఓటీటీ బాటలో వెళుతున్నామని నిర్మాతలు తెలిపారు. తాము ముందే హీరో నాని అనుమతి తీసుకున్నాం. ఆయ‌న కొన్ని రోజులు ఆగుదామ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేదు. దీంతో ద‌ర్శ‌కులు, నాని నిర్మాత‌ల ప‌రిస్థితులు అర్ధం చేసుకున్నారు. ప‌రిస్థితులతో పాటు మ‌మ్మ‌ల్ని కూడా అర్ధం చేసుకుంటార‌ని భావిస్తున్నాం" అని షైన్ స్క్రీన్స్ సంస్థ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు