''నన్ను దోచుకుందువటే'' ట్రైలర్ మీ కోసం..

శనివారం, 14 జులై 2018 (12:00 IST)
''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బాబు ఓ కంపెనీకి మేనేజర్‌గా, హీరోయిన్ నభా నటేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలలో నటించినట్లు తెలుస్తోంది. 
 
సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించాడు. కన్నడ నటి అయిన నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాజర్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అజనీష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాకు ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు