వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `అ!`. హీరో నాని, ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా ఎంటైర్ యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్`` అన్నారు.