పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న నిహారిక - చైతన్య!!

మంగళవారం, 4 జులై 2023 (22:35 IST)
మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంది. ఈ దంపతులిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని వారిద్దరూ ఎక్కడా కూడా ఖండించలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరుచేసింది. 
 
కొన్ని రోజులుగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తడంతో కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫోటో కూడా సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయింది. అదేసమయంలో తన ఇన్‌స్టా ఖాతా నుంచి నిహారిక ఫోటోను కూడా చైతన్య ఇటీవల తొలగించారు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు నిహారిక కూడా చైతన్య ఫోటోను తొలగించింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఈవెంట్లకు చైతన్య దూరంగా ఉంటూ వచ్చారు.
 
పైగా, గత కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నిహారిక ఇటీవల తన కొణిదెల ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో తెరిచారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలకు కూడా భర్త చైతన్య హాజరుకాలేదు. కాగా, గత 2020లో నిహారిక - చైతన్యల వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని పురాతన కోటలో జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహం జరిగిన రెండేళ్ళకే విడాకులు తీసుకుని విడిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు