జర్నీ గర్ల్, టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ యాక్ట్రస్ అనన్య నితిన్‌కు చెల్లెలుగా నటించనుంది. తెలుగులో జర్నీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నితిన్ ఇచ్చిన సోదరి రోల్ అయినా చేసేందుకు రెడీ అయిపోయింది. జర్నీ తర్వాత వెండితెరపై పెద్దగా కనిపించని అనన్య.. త్రివిక్రమ్, నితిన్, సమంత కాంబినేషన్లో వస్తున్న అ.. ఆ.. సినిమాలో నితిన్‌కు సోదరిగా నటించనుంది.