బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం - ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య

బుధవారం, 2 ఆగస్టు 2023 (13:18 IST)
ముంబై చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన తన స్టూడియోలోనే ప్రాణాలు తీసుకున్నారు. మంగళవారం రాత్రి నితిన్ దేశాయ్ తన స్టూడియోకు వెళ్లి అక్కడే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
 
కాగా, ఈయన ఆర్ట్ డైరెక్టరుగా పని చేసిన అనేక చిత్రాలకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయి. హిందీ, మరాఠీ భాషల్లో స్టార్ హీరోల చిత్రాలకు నితిన్ పని చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ముఖ్యంగా "లగాన్, దేవదాస్, జోదా ఆక్బర్" వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు ఆయన పని చేశారు. వీటికిగాను ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. 
 
కైవలం ఆర్ట్ డైరెక్టురుగానే కాకుండా చిత్ర దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన రెండు చిత్రాలకు పని చేశారు. నాలుగు చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపై బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు