కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్‌ను హీరోయిన్ నిత్యామీనన్ అద్భుతంగా వాడుకుంటోంది. ఈ సమయంలో రెండు కథలను సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. అందులో ఓ కథకు నిర్మాత కూడా దొరికాడట. నిత్య కథ చెప్పిన తర్వాత నిర్మాత ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ కథతో ఆమె సెట్స్ పైకి వెళుతుందని టాక్. అయితే లాక్ డౌన్ సమయంలో తను వెయిట్ తగ్గే పనిలో పడిందట. డైరక్షన్ ఓవైపు వెయిట్ లాస్ కోసం మరోవైపు నిత్యామీనన్ కసరత్తులు మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి.