బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్‌పై ఎంతో మంది విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అమీర్ ఖాన్ వివరణ ఇచ్చినా విమర్శకుల నోర్లు ఏమాత్రం మూతపడట్లేదు. సోషల్ మీడియాలో అమీర్ ఖాన్‌పై లేనిపోని విమర్శలు, సెటైర్లు విసురుతూ కాలం గడిపేస్తున్నారు. అలాంటి వారిని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏకిపారేశాడు. అమీర్ ఖాన్‌కు పూరీ మద్దతు తెలిపాడు.
పనికిమాలినవాళ్లంతా అమీర్ ఖాన్‌పై మండిపడుతున్నారని దుయ్యబట్టాడు. అమీర్ ఖాన్ సెలబ్రిటీ కావడంతోనే పనికిమాలినవాళ్లంతా ఆయనపై కామెంట్స్ చేస్తున్నారని, అదే అమీర్ ఖాన్ అల్ఖైదానో, ఐసిస్‌లో సభ్యుడైతే.. ఏ భారతీయుడైనా అతనిపై విమర్శించే గట్స్ కలిగివున్నాడా? అంటూ ప్రశ్నించాడు.