ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఎప్పుడు పూర్త‌వుతుంది..?

బుధవారం, 1 ఆగస్టు 2018 (10:10 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న అర‌వింద‌ సమేత చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం సెప్టెంబర్ మొదటి వారంలో విదేశాలకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో సెప్టెంబర్ 15న ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ చిత్ర టీజర్‌ను ఆగష్టు 15న విడుదలచేయనున్నారని సమాచారం.
 
జగపతిబాబు, నాగబాబు తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇటీవ‌ల వీరిద్ద‌రి పైన కాలేజ్ సీన్స్ చిత్రీక‌రించారు. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు