తిరుపతిలో కంట తడిపెట్టిన బాలక్రిష్ణ.. ఎందుకు?

మంగళవారం, 8 జనవరి 2019 (20:43 IST)
సినీనటుడు బాలక్రిష్ణ నటించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా టీం తిరుపతికి వచ్చింది. పి.జి.ఆర్ థియేటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు బాలక్రిష్ణ. మీడియాతో మాట్లాడారు. తన తండ్రి పాత్రను పోషిస్తానని అస్సలు అనుకోలేదని, తన తల్లిదండ్రుల నిజ జీవితాన్ని సినిమాలో చూపించామని చెప్పారు. సినిమా ట్రైలర్ చూస్తూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు బాలక్రిష్ణ.
 
తన తండ్రి క్యారెక్టర్లో తనను తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. థియేటర్లో రెండుసార్లు ట్రైలర్‌ను చూపించారు. మొదటి ట్రైలర్‌ను ఆసక్తిగా చూసిన బాలక్రిష్ణ.. రెండవ ట్రైలర్ చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన తల్లిదండ్రుల నిజ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆయన ఉద్వేగానికి లోనయినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు