సమంత ఏ ముహుర్తంలో పుట్టిందోగానీ.. దుమ్ములేపుతోంది....

సోమవారం, 8 జులై 2019 (13:03 IST)
హీరోయిన్ సమంత దశ తిరిగిపోయింది. ఈమె ఏ ముహూర్తంలో పుట్టిందోగానీ, పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఫలితంగా ఆమె నటించిన ప్రతి చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. 'రంగస్థలం', 'మజిలీ' తర్వాత సమంత నటించిన చిత్రం "ఓ బేబీ". 
 
ఈ చిత్రం కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్. ఇది ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ.17 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. 
 
ఈ మౌత్ పబ్లిసిటీ కారణంగా, ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా రూ.17 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారాంతం వరకూ ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును చూపించే అవకాశాలు వున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు